ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేశారు. స్థానిక ఆర్ అండ్ బీ ఆవరణలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టారు. ముందుగా టోకెన్లు జారీ చేసి.. వారికి మాత్రమే ఔషధాన్ని అందించారు. కరోనా నియంత్రణలో భాగంగా పి-రకం మందును ప్రజలకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మూర్తి రెడ్డి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: చౌక ధరకు ప్లాట్ల పేరిట.. 6 కోట్ల రూపాయలకు టోకరా!