ETV Bharat / state

ట్రైసైకిల్ మీద వెళ్తూ మంటల్లో చిక్కుకొని దివ్యాంగురాలు మృతి - Prakasham district Latest news

ట్రైసైకిల్ మీద వెళ్తూ మంటల్లో చిక్కుకొని ఓ దివ్యాంగురాలు సజీవ దహనమైంది. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో జరిగింది. ట్రైసైకిల్​లో మంటలు రావడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Disabled Lady caught in fire at Ongole
ట్రైసైకిల్ మీద వెళ్తూ మంటల్లో చిక్కుకొని దివ్యాంగురాలు మృతి
author img

By

Published : Dec 19, 2020, 4:34 AM IST

Updated : Dec 19, 2020, 11:49 AM IST

ట్రైసైకిల్ మీద వెళ్తూ మంటల్లో చిక్కుకొని దివ్యాంగురాలు మృతి

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఓ దివ్యాంగురాలు సజీవ దహనం అయ్యింది. గోపాల్​నగర్​కు చెందిన భువనేశ్వరిగా గుర్తించారు. ఆమె కమ్మపాలెం ప్రాంతంలో వాలాంటీరుగా పనిచేస్తుంది. దాసరాజుపల్లెకు వెళ్లే దారిలో ట్రైసైకిల్ మీద వెళ్తూ మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందింది.

ట్రైసైకిల్​లో మంటలు రావడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిందా..? ఎవరైనా హత్య చేశారా..? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన వాట్సప్ ఇక పనిచేయదని.. ఎవరూ మెసేజ్​లు చేయొద్దని.. తన చివరి సందేశంలో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

Last Updated : Dec 19, 2020, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.