ప్రకాశంజిల్లా చీరాలలో మాధురి అనే మహిళ కొన్నేళ్ల క్రితం స్థానిక ఎంజీసీ మార్కెట్లోని ఓ దుకాణంలో వస్త్రాలు కొనుగోలు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పని చేసే ఈమె తన పరపతి ఉపయోగించి... తర్వాత నగదు చెల్లిస్తానని చెప్పి వెళ్లిపోయింది. కాలం గడుస్తున్నా... నగదు చెల్లించకపోవడంతో... ఆమె పని చేసే కార్యాలయానికి వెళ్లాడు దుకాణ యజమాని లీలానంద్. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగాడు. కార్యాలయానికి వచ్చి తన పనికి భంగం కలిగించాడని అతనిపై మాధురి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వస్త్ర వ్యాపారి లీలానంద్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వస్త్రవ్యాపారులు లీలానంద్‌కు మద్దతుగా పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆయనపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'మైదుకూరులో డప్పు కళాకారులు ధర్నా'