ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన హర్షవర్ధన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను వేమవరం సమీపంలో ఓ గ్రానైట్ పాలిషింగ్ కర్మగారంలో పని చేస్తుండేవాడు. తోటి కూలీలతో కలిసి నివాసముంటున్నాడు. వివిధ అవసరాల నిమిత్తం అనేక అప్పులు చేశాడు. అవి తీర్చే దారి కనిపించకపోవటంతో ఆవేదనకు గురయ్యాడు. గదిలో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన సహచరులు యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ బాలకృష్ణ సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామ రెవెన్యూ అధికారి పూర్ణిమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వేమవరంలో అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య - person suicide at prakasham district
అప్పల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో జరిగింది.
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన హర్షవర్ధన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను వేమవరం సమీపంలో ఓ గ్రానైట్ పాలిషింగ్ కర్మగారంలో పని చేస్తుండేవాడు. తోటి కూలీలతో కలిసి నివాసముంటున్నాడు. వివిధ అవసరాల నిమిత్తం అనేక అప్పులు చేశాడు. అవి తీర్చే దారి కనిపించకపోవటంతో ఆవేదనకు గురయ్యాడు. గదిలో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన సహచరులు యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ బాలకృష్ణ సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామ రెవెన్యూ అధికారి పూర్ణిమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
ఆ 2 చట్టాలు పరస్పర విరుద్ధం