ETV Bharat / state

Cattle disease: అలాంటి వ్యాధి లేదన్నారు.. ఆధారాలు చూపిస్తే పరుగులు పెట్టారు - Deadly Lumpy Skin Disease outbreak in kanigiri

New diseases in cattle: ఆ ప్రాంతంలో ముగజీవాలు విచిత్రమైన వ్యాధితో ఆవులు బాధపడుతున్నాయి. రైతులు పశు వైద్యులకు చూపిస్తే.. ఎలాంటి వ్యాధి లేదంటూ కొట్టి పారేశారు. ఈనాడు-ఈటీవీ ప్రతినిధులు ఆధారలతో సహా చూపించడంతో.. తేరుకున్న వైద్యాధికారులు పశువుల రక్తనమూనాలు సేకరించి ల్యాబ్​కు పంపించారు. ప్రభుత్వాధికారుల తీరుపై పశుపోషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Deadly Lumpy Skin Disease
విచిత్రమైన వ్యాధితో ఆవులు
author img

By

Published : Sep 27, 2022, 9:28 PM IST

Cattle disease in kanigiri : మూగ జీవాల రోదన అధికారులకు అపహాస్యంగా అనిపించింది. ఇదే అంశంపై ఈనాడులో కథనం ప్రచురించగా... అధికారులు మాత్రం పశువులకు అలాంటి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్నారు. చివరికి ఆధారాలతో చూపిస్తే.. ఉరుకులు పరుగులు పెట్టారు ఆ ప్రాంతంలోని పశు వైద్యాధికారులు. ప్రకాశం జిల్లా కనిగిరిలో గత కొంత కాలంగా లంపి స్కిన్ వ్యాధి లక్షణాలతో ఆవులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. పాడిరైతులు పశువులను ప్రభుత్వ పశు వైద్యులకు చూపించారు.

అయినా వాటి గోడు వైద్యులకు ఏ మాత్రం పట్టడం లేదు. ఇదే అంశంపై ఈనాడులో 'లంపి స్కిన్'తో విలవిల అనే కథనం ప్రచురితమైంది. అయినా అధికారులలో ఎటువంటి చలనం రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా అసలు ఈ వ్యాధి కనిగిరి డివిజన్ ప్రాంతంలో ఎక్కడా లేదనడం విడ్డూరంగా ఉందని పాడి రైతులు వాపోయారు. మార్కాపురం పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో కనిగిరి పశు వైద్యాధికారులతో స్థానిక పశు వైద్యశాలలో సమావేశమై.. కథనం తప్పంటూ పేర్కొన్నారు. కనిగిరి పట్టణంలోని ఓ వీధిలో వ్యాధికి గురైన ఆవులను గుర్తించి.. వెంకటసుబ్బయ్యకు సమాచారమివ్వడంతో పశు వైద్యులు హడావుడిగా పరుగులు తీసి ఆవుల నుండి రక్త నమూనాలు సేకరించారు. అనంతరం ఆ ఆవుకు చికిత్స ప్రారంభించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.