ప్రకాశం జిల్లా వేటపాలెంలోని రాజీవ్ స్వగృహ ద్వారం వద్ద చనిపోయిన కోళ్లు గుట్టలుగా పడి ఉన్నాయి. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో ఇలా గుట్టలుగా పడివున్న కోళ్లను చూసి స్థానికులు ఆందోళనకు చెందుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఉదయాన్నే పడేసి వెళ్లారని పట్టణ వాసులు చెబుతున్నారు. గుట్టలోని కోళ్లను పరిశీలించగా శరీరంలోని కొంతభాగం ఆకుపచ్చ రంగులో ఉన్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి చనిపోయిన కోళ్లను పరీక్ష చేయాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :