ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెం గ్రామాన్ని దర్శి డీఎస్పీ ప్రకాష్ రావు సందర్శించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దిల్లీ నుంచి ఇటీవల ఒంగోలుకు వచ్చాడు. అతనికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయంపై డీఎస్పీ అతని కుటుంబీకులతో మాట్లాడారు. ఆ వ్యక్తి గురించి ఆరా తీశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని డీఎస్పీ సూచించారు.
ఇదీ చూడండి: కొరవడిన పర్యవేక్షణ.. కొండెక్కిన కూరగాయల ధరలు