ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మలంపాడు గ్రామంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు శ్రుతి మించి రికార్డింగ్ డాన్సుల స్థాయిని తలపించాయి.. ఫలితంగా వైకాపా నాయకులపై విమర్శలు వెల్లువెత్తాయి. గుమ్మలంపాడు గ్రామంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రాంతాల నుంచి డ్యాన్సర్లను పిలిపించి.. ఆటా పాటలతో కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి స్వయంగా పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటి డ్యాన్సులు నిర్వహించటంపై పలువురు విమర్శిస్తున్నారు.
ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు