రాష్ట్రంలో 25 ఎకరాల్లో అంబేడ్కర్ స్మృతి వనాన్ని నిర్మించాలని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడారు. సబ్ ప్లాన్ నిధుల నుంచి వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు రెండు నెలల్లో భర్తీ చేయాలని లేకుంటే న్యాయస్థానాన్నీ ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నలుగురిని ఎన్ కౌంటర్ చేసినంత మాత్రాన మహిళలపై దాడులు తగ్గవని... రెండు తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగినప్పుడే దాడులు ఆగుతాయని అన్నారు.
ఇదీ చూడండి: 'అంబేడ్కర్ స్మృతి వనాన్ని రాజధానిలోనే నిర్మించాలి'