ప్రకాశం జిల్లా, కొమరోలులో, దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు సంఘటనల్లో చోరీలకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఒక ద్విచక్ర వాహనాన్ని, 90 వేల రూపాయలు విలువచేసే బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డీఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించిన వివరాల మేరకు..
ఇటీవల పురుషోత్తముని పల్లి గ్రామ సమీపంలో శ్రీనివాసులు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి మహిళ మెడలో బంగారు గొలుసును దొంగిలించారు. అదే విధంగా ముక్తాపురం లోని పీర్ల చావిడి వద్ద ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించిన ఇండ్ల రాజశేఖర్, బిల్లా హరికృష్ణ అపహరించారు. వీరిని పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: married woman dead: పెళ్లై రెండు నెలలైనా కాలేదు.. వివాహిత అనుమానాస్పద మృతి