ఒంగోలులో సీపీఐ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విలేకర్ల సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...జీడీపీ గణనీయంగా పడిపోతుందని, ఉత్పత్తి రంగం కూడా కుదేలవుతుందన్నారు..పరిశ్రమలు మూతపడి కార్మికులకు, ఉద్యోగులకు పనుల్లేక అల్లాడుతున్నారని, 12.5శాతం ఉండే ఉత్పత్తి రంగం 2 శాతానికి పడిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. కేంద్రం నిర్ణయాలు విచిత్రంగా, ప్రజలను ఇబ్బంది పాలుచేసే విధంగా ఉన్నాయయన్నారు. తెలుగురాష్ట్రాల ప్రధాన కేంద్రాలుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను స్టేట్ బ్యాంకులోనూ, ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులోనూ విలీనం చేయడాన్ని తప్పుపట్టారు..
ఇదీ చూడండి