రాష్ట్ర వ్యాప్తంగా ఐదో రోజున 25 వేల 734 మందికి కరోనా టీకాలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 596 కేంద్రాల్లో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 91 వేల 406 మందికి టీకాలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. భారత్ బయోటెస్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను వేశామనీ.. రాష్ట్రానికి 20 వేల కొవాగ్జిన్ డోసులు వచ్చాయని తెలిపింది.
ప్రకాశం జిల్లాలో కొవిడ్ టీకా పంపిణీ ఐదవ రోజున గణనీయంగా పెరిగింది. గత నాలుగు రోజులుగా ప్రక్రియ మందకొండిగా సాగినా.. ఐదో రోజు మాత్రం జోరందుకుంది. వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. జిల్లాలోని 36 మండలాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టగా.. బుధవారం 2,800 మందికి టీకాలు వేసినట్లు వివరించారు. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 6,245కి చేరింది.
ఇదీ చదవండి: