ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ కేసు కలకలం రేపుతోంది. ఒంగోలుకు చెందిన ఓ యువకుడు వ్యాధి లక్షణాలతో ఈ నెల14న రిమ్స్‌లో చేరగా వ్యాధి నిర్ధరణ కోసం నమూనాలు తిరుపతి పంపించారు. బుధవారం రాత్రి పాజిటివ్‌గా నివేదికలు రావడం వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. యువకుడు ఇటీవలే లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న అతడు తొలుత ఒంగోలు, తరువాత గుంటూరులో చికిత్స చేయించుకున్నారు. కానీ ఆరోగ్యం కుదుట పడకపోవడం వల్ల మళ్లీ ఒంగోలు రిమ్స్‌లో చేరాడు. వైద్యులు అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. కరోనా పాజిటివ్‌గా రావటంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. యువకుడి కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
ఇవీ చదవండి...కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు