ETV Bharat / state

కోవిడ్​-19తో చీరాల, కారంచేడులో నలుగురు మృతి

రాష్ట్రంలోనే రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రకాశం జిల్లాలో వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం చీరాల, కారంచేడులో నలుగురు మృతి చెందారు. మరోపక్క ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చీరాల, కారంచేడులో కరోనాతో నలుగురు మృతి
చీరాల, కారంచేడులో కరోనాతో నలుగురు మృతి
author img

By

Published : Aug 11, 2020, 1:49 PM IST

ప్రకాశం జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు మరణాలు కూడా సంబవిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోనే రెండో పాజిటివ్ కేసు మార్చి 19 నమోదుకాగా ఆ తర్వాత 70 రోజుల్లో 70 మంది మాత్రమే వైరస్ బారిన పడ్డారు. వారందరు కోలుకుని ఇళ్లకు వెళ్లటంతో జిల్లావాసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.. ఇక జూన్ నుంచి పాజిటివ్ కేసులు క్రమంగా పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో చేరడంతో సోమవారానికి పది వేలకు చేరువయ్యాయి. మరణాలు కూడా పెరుగుతూ 122కి చేరాయి. చీరాల, కందుకూరు, మార్కాపురం ఆసుపత్రుల్లో కోవిడ్ సేవలు అందిస్తున్నప్పటికి ఆక్సిజన్, పడకలు, వెంటిలేటర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. చీరాలలో సోమవారం ముగ్గురు కరోనాతో మృతి చెందగా కారంచేడులో కోవిడ్ బారిన పడి ఒకరు మృతిచెందాడు.

ఇవీ చదవండి

గిద్దలూరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సుశీల ఆత్యహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.