ETV Bharat / state

మిరపకు కరోనా ఘాటు... పొలాల్లోనే ఎండిపోతున్న పంట

ఘాటు మిరపపైనా కరోనా ప్రభావం పడుతోంది. చేతికొచ్చిన పంట కోసేందుకు కూలీలు దొరక్క రైతులు విలవిలలాడుతున్నారు. ప్రకాశం జిల్లాలో కోతలు పుంజుకుంటున్న సమయంలో లాక్‌డౌన్ నష్టాలకు గురిచేస్తోంది. జనవరిలో కురిసిన వర్షాలు దెబ్బకొట్టగా ఇప్పుడు కరోనా ముప్పుతిప్పలు పెడుతోంది. కొనుగోళ్లూ నిలిచిపోవడం వల్ల రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

corona affect on mirchi in AP
మిరపకు కరోనా ఘాటు... పొలాల్లోనే ఎండిపోతున్న పంట
author img

By

Published : Mar 31, 2020, 7:10 AM IST

Updated : Mar 31, 2020, 8:17 AM IST

మిరపకు కరోనా ఘాటు... పొలాల్లోనే ఎండిపోతున్న పంట

ప్రకాశం జిల్లాలో రైతులు సుమారు లక్షా 20 వేల ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచే కోతలు ప్రారంభం అయినా.. ప్రకాశం జిల్లాలో మార్చి నుంచి మొదలవుతాయి. జనవరిలో కురిసిన వర్షాలకు కొంతమేరకు పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా చేతికొస్తుందనకున్న పంట తెగుళ్ళ బారిన పడింది. పురుగుమందులు కొట్టి పంటను కాపాడుకుని ఎంతో కొంత మిగుల్చుకుందామనుకున్న రైతులు మార్చి నెల నుంచి కోతలకు సిద్ధమయ్యారు. ఆలోపు కరోనా వైరస్‌ కారణంగా లాక్​డౌన్‌ అమలుకావడం.. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కూలీలు పనులకు వచ్చే వారు లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచాయి.

40 శాతం పంట నష్టం

కనీసం ఐదారు కోతలు కాసే మిరప ఒకటి రెండు కోతలు కూడా పూర్తిచేయని రైతులు లబోదిబోమంటున్నారు. కూలీలు వచ్చే అవకాశం లేక పండిన పంటంతా చేలలోనే ఎండిపోయి నేల రాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 శాతం పంట దెబ్బతింటోందని మొరపెట్టుకుంటున్నారు.

తగ్గిన గిట్టుబాటు ధర

జిల్లాలో నాగులప్పలపాడు, ఇంకొల్లు, పరుచూరు, మార్టూరు, అద్దంకి, ఎర్రగొండపాలం, త్రిపురాంతకం మండలాల్లో పెద్ద ఎత్తున మిరప సాగు చేశారు. 3 వారాల కిందట వరకూ 16 నుంచి 17 వేలు పలికిన క్వింటా ధర ఇప్పుడు సగానికి పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ ఒకేసారి కూలీల అవసరం ఉన్నందున.. వేతనం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : కరోనా ప్రభావం.. పూల వ్యాపారులకు తీవ్ర నష్టం

Last Updated : Mar 31, 2020, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.