గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను విద్యాధికులను చేస్తే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందని, ఆ దిశగా మహిళలను విద్యావంతులను చేసేందుకు తమ సంస్థ పనిచేస్తోందని మురుగప్ప కోరమాండల్ సంస్థ నిర్వహకులు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 9వ తరగతిలో విశేష ప్రతిభ చూపించిన విద్యార్థినులకు అవార్డులు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ సంస్థ తరఫున ఏటా చదువులో ప్రతిభ చూపిన బాలికలకు ఈ పురస్కారాలు అందజేస్తున్నామని సుబ్బారెడ్డి అన్నారు.
ఇవీ చదవండి.. 'ఈనాడు' ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ క్లాసులు