ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కడపరాజుపల్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పాతకక్షలతో పాటు పొలం గట్టు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగటంతో కొడవళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం గాయపడ్డవారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో మహాలక్ష్మమ్మ, అంజనేయులుకు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్య కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
ఇదీ చదవండి