ETV Bharat / state

తోట త్రిమూర్తులును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి: ప్రజాసంఘాల నాయకులు - Community leaders protest news

తోట త్రిమూర్తులుకు గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వటాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో ప్రజాసంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అతన్ని పదవి నుంచి తొలగించాలంటూ ముక్కోణం పార్క్​ కూడలిలో ఉన్న అంబేద్కర్​ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

protest
నిరసన
author img

By

Published : Jun 18, 2021, 6:21 PM IST

తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటాన్ని నిరసిస్తూ.. ప్రకాశం జిల్లా చీరాలలో ప్రజాసంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ముక్కోణం పార్క్​ కూడలిలో ఉన్న అంబేద్కర్​ విగ్రహం వద్ద త్రిమూర్తులు ఎమ్మెల్సీని రద్దు చేయాలని నినాదాలు చేశారు. అతన్ని పదవి నుంచి తొలగించాలని అంబేద్కర్​ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిగా ఉన్న తోటా త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని ప్రజా సంఘాల నాయకుడు మోహన్ ​కుమార్​ ధర్మా అన్నారు. దళిత ద్రోహిని గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీని చేయటం దుర్మార్గమని మండిపడ్డారు.

దళిత, గిరిజనుల సంక్షేమానికి కృషిచేస్తానన్న సీఎం జగన్​.. దళిత వ్యతిరేకి అయిన త్రిమూర్తులుకు పదవి ఎలా ఇచ్చారో తెలియటం లేదని మోహన్ ​కుమార్​ ధర్మా అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. లేనిఎడల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులు, గిరిజనులు ఉద్యమం లేవనెత్తుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుడు పులిపాటి రాజు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: manthena sathyanarayana : దొంగే... దొంగా దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు: మంతెన సత్యనారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.