ETV Bharat / state

'పొగాకు కొనుగోళ్లలో వేగం పెరగాలి.. రైతులకు న్యాయం చేయాలి' - జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్

ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్ల సంక్షోభంపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని బోర్డు అధికారులు, బయ్యర్లు సమన్వయంతో పని చేయాలని చెప్పారు.

praksam district
పొగాకు కొనుగోళ్ళపై సమావేశం
author img

By

Published : Jun 3, 2020, 6:41 PM IST

పొగాకు కొనుగోళ్లకు ప్రకాశం జిల్లాలో 40 సంస్థలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయని, వీరందరూ విధిగా వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ చెప్పారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్లపై ఏర్పడ్డ సంక్షోభంపై... కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో ఈ ఏడాది లక్ష్యానికి తగినంతగా పొగాకు కొనుగోళ్లు జరగలేదని చెప్పారు.

ఈ సందర్భంగా.. కలెక్టర్​కు రైతులు సమస్యలు విన్నవించారు. పెట్టుబడుల ఖర్చు 35 శాతం పెరిగిందని, లో గ్రేడ్‌ పొగాకు కిలోకు రూ. 82.44 మాత్రమే చెల్లించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. కనీసం 100 రూపాయలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోరారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని బోర్డు అధికారులు, బయ్యర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. జాయింట్‌ కలెక్టర్‌ మురళి, పొగాకు బోర్డు ఆర్ఎమ్ షేక్‌ అబ్దుల్లా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

స్పెషల్ లీవ్ పిటిషన్‌లో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.