సీఎం జగన్‌ను మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత రేపు ఉదయం కలవనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు పిలువు వచ్చిందని ఆమె తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల నుంచి బయలుదేరి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి సీఎంతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు.
పోతుల సునీత గతంలో రాజీనామా చేసిన స్థానంలో మళ్లీ ఆమెకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. సీఎం జగన్‌ను విజయవాడలో కలిసిన అనంతరం.. నామినేషన్ వేస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: మిషన్‌కు చీర చుట్టుకుని మహిళ మృతి