ETV Bharat / state

సామూహిక అత్యాచార నిందితుల అరెస్టుపై ఎస్పీకి ప్రశంసలు - సామూహిక అత్యాచార నిందితుల అరెస్టుపై ఎస్పీకి ప్రశంసలు

ఇటీవల 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనపై సీఎం జగన్‌ ఆరా తీశారు. 24 గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేయడంపై ఎస్పీని ప్రశసించారు.

సామూహిక అత్యాచార నిందితుల అరెస్టుపై ఎస్పీకి ప్రశంసలు
author img

By

Published : Jun 26, 2019, 7:47 PM IST

ఒంగోలు పట్టణంలో ఇటీవల 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. అమరావతిలోని ప్రజావేదికలో నిర్వహించిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల సమావేశంలో ఈ దుర్ఘటన గురించి సీఎం ప్రస్తావించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. 24 గంటల వ్యవధిలోనే ప్రమేయం ఉన్న ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. నేరం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్పందించి... రాత్రికి రాత్రే నిందితులను అరెస్టు చేసిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌తోపాటు... జిల్లా పోలీసులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండీ...

అధైర్యం వద్దు.. అండగా ఉంటాం: హోంమంత్రి

Intro:ap_knl_111_26_nindithudu_arestu_ab_c11 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక: పోలీసుల అదుపులో నిందితుడు

Body:కర్నూలు జిల్లా కోడుమూరు పెట్రోల్ బంక్ సమీపంలో ఎస్ ఐ నల్లప్ప ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆటోలో ఉన్న వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులను పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అనుమానించి వ్యక్తిని అదుపులోకి తీసుకొని ని ఆరా తీశారు.

Conclusion:ఎస్సై మాట్లాడుతూ నిందితుడు గూడూరు కు చెందిన పోతుల కర్రెన్న ను విచారించగా గతంలో దొంగతనానికి పాల్పడినట్లు తేలిందన్నారు. కోడుమూరులోని అన్నా వైన్స్ లో దొంగతనం చేసినట్లు తెలిసిందన్నారు. కోడుమూరు తాసిల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న వెంకటేశ్వరమ్మ అనే మహిళ ఇంట్లో దొంగతనం చేసినట్లు విచారణలో తెలిసిందన్నారు .ఈ మేరకు నిందితుడు కర్రీన్న నుంచి 47 వేల రూపాయల నగదు, గోల్డ్ చైన్ బంగారు, కమ్మలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.