ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ రికార్డులు, రీ సర్వే అంశాలపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలోని ప్రామాణికంగా తీసుకుని రెవెన్యూ గ్రామాలను విభజించుకుని రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. జిల్లాలో 1058 రెవెన్యూ గ్రామాలు ఉండగా 112 రెవెన్యూ గ్రామాల్లోని రికార్డుల్లో లోపాలున్నట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. లింగ సముద్రం, చీమకుర్తి మండలాల్లో ఇలాంటి గ్రామాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
సమన్వయంతో పనిచేయాలి..
ఇలాంటి గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిశిత పరిశీలన చేసి ఒక స్టాండర్డ్ డాక్యూమెంట్లను తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమాన్ని సమగ్రంగా, స్పష్టంగా పూర్తి చేయడానికి తహసీల్దార్లతో సమన్వయంతో పని చేయాలని ఆర్డీఓలకు దిశానిర్ధేశం చేశారు. సర్వేయర్లు, వీఆర్ఓలు లేని గ్రామాల్లో పక్క గ్రామాల సిబ్బంది సహకారంతో పూర్తి చేయాలని ఆదేశించారు.
సక్రమంగా ఉంటేనే..
గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని.. భూ రికార్డులు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి కూడా సాఫీగా సాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) టీఎస్ చేతన్, ఇన్‌ఛార్జ్ సంయుక్త కలెక్టర్ వినాయకం, ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : పోతిరెడ్డి సహా ఇతర ప్రాజెక్టులు ఆపకపోతే.. మేం ఆనకట్ట నిర్మిస్తాం: కేసీఆర్