ఇంకొన్ని రోజుల్లో చిన్నారిని ఎత్తుకోబోతున్నానన్న అనందంలో ఏడు నెలల గర్భిణి వైద్య పరీక్షలకు బయలుదేరింది. ద్విచక్ర వాహనంపై భర్తతో కలిసి డాక్టర్ చెకప్‌కు బయల్దేరింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని పేర్నమిట్ట వద్దకు చేరుకోగానే ఆమె చున్నీ ద్విచక్ర వాహనంలో ఇరుక్కుపోయి ఒక్కసారిగా రోడ్డుపై పడి మృత్యువాతపడింది.
ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రానికి చెందిన సుమ (22) సంతనూతలపాడుకు చెందిన మోషేతో ఏడాది క్రితం వివాహమైంది. వివాహం జరిగిన ఏడాదిలోపే గర్భం దాల్చటంతో కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలారు. ప్రస్తుతం ఏడో నెల కావడంతో వైద్య పరీక్షల కోసం ఒంగోలుకు భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. ఇంకొ పది నిమిషాల్లో ఒంగోలు చేరుకుంటామనే సమయంలో.. మెడలో చున్నీ ద్విచక్ర వాహనంలో ఇరుక్కుపోయి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఒంగోలులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా...అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబంలోకి చిన్నారి వస్తుందన్న సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి...