ETV Bharat / state

చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్​... విలువైన ఆభరణాలు స్వాధీనం - చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్​... విలువైన ఆభరణాలు స్వాధీనం

ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ఓ ఇంట్లో నుంచి సూమారు రూ. 4 లక్షల విలువచేసే సొత్తును దోచుకెళ్లిన కేసును చీరాల పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి విలువైన వస్తులువు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజమోహన్ తెలిపారు.

chirala police catch two persons by theft case
చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్​... విలువైన ఆభరణాలు స్వాధీనం
author img

By

Published : Oct 3, 2020, 11:05 PM IST

ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని నవాబ్​పేట బోస్​నగర్​ ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో చోరీ కేసుకు సంబంధించి... ఇద్దరు నిందితులను చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వివరించారు. బోస్​నగర్​కు చెందిన తాళ్లూరి సుగుణ, మల్లిఖార్జునరావు దంపతులు. అనారోగ్యం కారణంగా ఇద్దరూ గుంటూరులోని ఎన్​ఆర్​ఐ ఆసుపత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. సుగుణ హైదరాబాద్ నుంచి మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చారు. తలుపుతీయగానే బీరువాలో ఉండాల్సిన వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే బాధితురాలు చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. కంపా శ్రీనివాసరెడ్డి, కె.వెంకట వంశీకృష్ణ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 13 సవర్ల బంగారు ఆభరణాలు, టైటాన్ వాచ్, 12 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ రూ. 4 లక్షల రూపాయలు ఉంటుందని చీరాల 1వ టౌన్​ సీఐ రాజమోహన్ తెలిపారు.

ఇదీ చూడండి:

తిరుపతి యువతి.. మూగజీవాల ప్రియనేస్తం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.