ETV Bharat / state

స్పందనకు వందనం: వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద అధికారుల దిద్దుబాటు చర్యలు - చీరాలలో వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద పరిస్థితి

'ఈటీవీ భారత్'​లో వచ్చిన కథనంపై ప్రకాశం జిల్లా చీరాల అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆంధ్రరత్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా ఉండగా.. ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఏసయ్య వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు.

vaccination center in chirala
చీరాలలో వ్యాక్సినేషన్ కేంద్రం
author img

By

Published : May 16, 2021, 6:19 PM IST

వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద పరిస్థితి ఇదీ!

'వాక్సినేషన్ కేంద్రం వద్ద గుంపులు-కరోనా వస్తుందేమో అన్న ఆందోళనలో ప్రజలు' పేరిట.. 'ఈటీవీ భారత్​' కథనం ఇచ్చింది. దీనిపై అధికారులు స్పందించారు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఆంధ్రరత్న మున్సిపల్ ఉన్నత పాఠశాల వద్దకు ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఏసయ్య చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఏప్రిల్ 10 లోపు మొదటి డోసు టీకా వేయించుకున్నవారు రెండో డోసు తీసుకోవాలని అధికారులు చెప్పడంతో.. ఒక్కసారిగా టీకా కేంద్రం వద్దకు ప్రజలు భారీగా చేరుకున్నారు. టీకా, పేరు నమోదు కేంద్రం ఒకే దగ్గర పెట్టడంతో.. ఒకరినొకరు నెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజల ఇబ్బందులపై.. 'ఈటీవీ భారత్'​లో కథనం వచ్చింది.

ఇదీ చదవండి: 'భారత్​, బ్రిటన్ స్ట్రెయిన్​లపై కొవాగ్జిన్ సమర్థవంతం'

వేర్వేరు చోట్ల పేర్లు నమోదు, టీకా కేంద్రాలు ఏర్పాటుచేసి.. బౌతికదూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒకేసారి అందరూ వ్యాక్సినేషన్ కేంద్రానికి రావడంతో హడావుడి ఏర్పడిందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాము వచ్చి పరిస్థితిని చక్కదిద్దామని.. ప్రతి ఒక్కరికీ టీకా వేస్తామని పట్టణ ప్రజలకు భరోసా ఇచ్చారు.

అనుబంధ కథనం:

చీరాలలో కరోనా వ్యాక్సిన్ కోసం తోపులాట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.