ETV Bharat / state

భర్త హత్యకు భార్య పథకం.. మత్తులో దించి కత్తి పోట్లు - ప్రకాశం క్రైమ్​ వార్తలు

నిండు నూరేళ్లు కలిసి జీవిద్దామనుకున్న వారి ప్రయాణం కలహాలతో మధ్యలోనే ఆగిపోయింది. కలిసి జీవించలేమని విడాకులకు సిద్ధపడ్డారు. కానీ ఇంతలోనే భర్త హత్యకు బంధువులో కలిసి పథకం వేసింది. భర్తను మద్యం మత్తులో దించి....బంధువులతో కలిసి హతమర్చింది.

వ్యక్తి హత్య కేసులో భార్య సహా ఏడుగురి అరెస్టు

author img

By

Published : Jun 6, 2020, 10:48 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో దిలీప్​ అనే వ్యక్తి హత్యకేసులో భార్యతో సహా కుటుంబ సభ్యులను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో 14 సంవత్సరాల బాలుడు ఉన్నట్లు చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు. పథకం ప్రకారమే నిందితులు హత్య చేసినట్లు పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా చీరాల మండలం సాయికాలనీలో దిలీప్​, రెబకా దంపతులు జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు సంతానం.. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారు. లాక్​డౌన్ కారణంగా పెద్దల సమక్షంలో ఇద్దరూ మాట్లాడుకుని లాక్​డౌన్ అనంతరం కోర్టు ద్వారా విడాకులు తీసుకుందామని అనుకున్నారు. అయితే ఈ విషయంపై మాటామాటా పెరిగి గొడవపడ్డారు. ఈ క్రమంలో భర్తను హత్య చేయాలని భావించిన భార్య రెబకా కుటుంబ సభ్యులు దిలీప్​ను పిలిపించి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న దిలీప్​పై కత్తితో దాడి చేసి చంపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు భార్య రెబక్​, అత్త, మామ, బావమరిదితో సహా ఏడుగురిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి..

విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.