ETV Bharat / state

'అది స్వేచ్ఛ కాదు బాధ్యత.. నిబద్ధతతో చదవాలి'

చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన అచీవర్స్ డే కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

chirala engineering college
cbi ex- jd lakshmi narayana
author img

By

Published : Aug 28, 2021, 7:31 PM IST

ఇంజినీరింగ్ చదివే విద్యార్థుల భవిష్యత్తుకు.. వారు చదివే నాలుగు సంవత్సరాలు కీలకమైనవని.. ఆ సమయంలో నిబద్దతతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రకాశం జిల్లాలోని చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన అచీవర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్ధేసించి మాట్లాడారు.

కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న 250 మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. వారికి మెమెంటోలు, సర్టిఫికెట్లు ప్రధానం చేసారు. చిన్నతనం నుంచే విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. బయట చదువుకునే విద్యార్థులు స్వేచ్ఛ వచ్చిందని అనుకుని కొంతమంది వ్యసనాలకు బానిసలవుతున్నారని.. దానిని బాధ్యతగా భావించి చదువుకోవాలని అన్నారు. ఎవరైతే ప్రవాహంలో ఎదురీదగలుగుతారో వారే సమాజంలో నిలబడగలరని చెప్పారు.

ఇదీ చదవండి:

E-VEHICLES: ఆకర్షిస్తున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు.. సామాన్యులకు అందుబాటులో ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.