ETV Bharat / state

చనిపోయాడని ఖననం చేస్తే.. కలలోకొచ్చి తనను తీయాలన్నాడు.. ఆ తర్వాత

boy body was twice buried: మనుషుల మరణాల్లో చాలాసార్లు కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం, వింటుంటాం. కొన్ని సార్లు ఈ ఘటనలు వింతగా అనిపిస్తే, మరికొన్నిసార్లు భయాందోళనకు గురిచేస్తాయి. అలాంటి ఘటనే ఇప్పుడు ప్రకాశం జిల్లా దర్శిలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల వయసున్న పసికందు చనిపోతే, ఖననం చేసిన బాలుడిని వెలికి తీసి... పాలు తాగించారు. వైద్యులను సంప్రదించగా మరణించాడని చెబితే మళ్లీ ఖననం చేశారు. ఆశ్చర్యంగా ఉంది కదూ !. అసలేం జరిగిందంటే..?

author img

By

Published : Apr 2, 2022, 11:25 AM IST

Updated : Apr 2, 2022, 12:09 PM IST

boy body was twice buried
బాలుడికి రెండుసార్లు ఖననం

boy body was twice buried: ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మంగినపూడి గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకున్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 26వ తేదీన మంగినపూడి గ్రామానికి చెందిన దంపతులకు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో బాలుడు జన్మించాడు. పుట్టిన బాలుడికి ఫిట్స్ రావడంతో తల్లి, బిడ్డను ఒంగోలు రిమ్స్​కు తరలించారు. రిమ్స్​లో బాలుడికి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఆ దంపతులు తమ స్వగ్రామంలో బాలుడిని ఖననం చేశారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది.

boy body was twice buried: చనిపోయిన బాలుడు... జేజమ్మకు కలలో కనిపించి తాను బతికే ఉన్నానని చెప్పినట్లు, తనను బయటకు తీయాలని కోరినట్లు బాలుడి జేజమ్మ కుటుంబ సభ్యులకు చెప్పటంతో, స్మశానం లోకి వెళ్లి బాలుడిని బయటకు తీశారని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో బాలుడు పాలు తాగాడని, మూత్ర విసర్జన చేసుకున్నాడని అన్నారు. దీంతో బాలుడిని కుటుంబ సభ్యులు తిరిగి మార్కాపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడు మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు. అక్కడ నుంచి స్వగ్రామానికి వచ్చి బాలుడికి మళ్లీ ఖనన సంస్కారాలు నిర్వహించారని పేర్కొన్నారు. మరణించిన బాలునికి రెండు సార్లు ఖననం చేశారని గ్రామస్థులు చెప్పారు.

ఇదీ చదవండి: Fire Accident: ప్రకాశం జిల్లా జాళ్ళపాలెంలో అగ్ని ప్రమాదం.. 10బైకులు దగ్ధం

Last Updated : Apr 2, 2022, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.