ETV Bharat / state

డిఫెన్స్ క్లస్టర్, నిమ్జ్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం లేదు..

ప్రకాశం జిల్లాలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కృత నిశ్చయంతో ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు.

BJP state president Somu Weeraju
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
author img

By

Published : Jul 11, 2021, 3:39 PM IST

ప్రకాశం జిల్లా అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మొదటిసారి ఒంగోలుని సందర్శించారు. జిల్లాలో డిఫెన్స్ క్లస్టర్, నిమ్జ్.. అభివృద్ధికి యత్నిస్తున్నా ప్రభుత్వం స్పందించటం లేదని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో డైరీలు, స్పిన్నింగ్ మిల్లులు అమేస్తుంటే ఎందుకు ప్రతిపక్షాలు ప్రశ్నించడం లేదన్నారు.. కేసీఆర్, జగన్ జల వివాదాలు విషయంలో ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జిల్లాలోని మత్స్యకారులు కోసం బెర్త్​లను నిర్మించాలన్నారు. జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు గురించి వాటిని పూర్తి చేసే అంశం గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. జిల్లాలోని నాలుగు ప్రధాన సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు నీటి వనరులపై ఈనెల 19వ తేదీన విజయవాడలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఏపీలో నీటి వనరులపై సెమినార్ నిర్వహిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ.. pulichinthala project: ప్రభుత్వ విప్​ను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.