ఉల్లి విక్రయకేంద్రాలు ప్రారంభించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీపై ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే... చీరాలలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండి:
వెదురుకుప్పం పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్థులు...ఫర్నిచర్ ధ్వంసం