ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన.. ప్రకాశం జిల్లా పర్చూరులో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నాగులుపాడు నుంచి చీరాల వెళుతున్న కారు, పర్చూరు నుంచి చిలకలూరిపేటకు వెళుతున్న బైక్ ని ఢీ కొట్టింది.
ఈ నప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న పఠాన్ మహబూబ్ సుభాని అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు చిలకలూరిపేటకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనలో కారు కూడా అదుపుతప్పి బోల్తా పడింది. కారు టైరు పంక్షరై ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి