ETV Bharat / state

Farmers problems: శెనగకు తెగుళ్ల బెడద.. రైతుకు తప్పని వ్యధ - ప్రకాశం జిల్లాలో శెనగ పంట

Bengalgram Farmers problems : పంటలు మార్చినా ఫలితాలు మాత్రం మారడం లేదు. ఆలస్యంగా సాగు చేసినా నష్టాలూ...తప్పడం లేదు. అకాల వర్షాల ఒకవైపు.. మారిన వాతావరణ పరిస్థితులు మరోవైపు...వెరసి శెనగ రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోలేక... సాగును కొనసాగించలేక..రైతులు మధ్యలోనే పంటలను తొలగిస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది.

Bengalgram Farmers problems
శెనగకు తెగుళ్ల బెడద...రైతుకు తప్పని వ్యధ
author img

By

Published : Feb 8, 2022, 5:22 PM IST

శెనగకు తెగుళ్ల బెడద...రైతుకు తప్పని వ్యధ

ప్రకాశం జిల్లాలో శెనగ పంట సాగు చేసిన రైతులు... ఈసారి నిండా మునిగారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి , దర్శి , పర్చూరు, అద్దంకి, కందుకూరు, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల్లో రబీ కింద 90 వేల హెక్టార్లలో శెనగ పంట వేశారు. సాధారణంగా నవంబర్ నెల ఆరంభంలో శెనగను సాగు చేస్తారు. ఈ సీజన్లో వర్షాలు కురిసి... వాతావరణం అనుకూలించలేదు. ఫలితంగా నెల ఆలస్యంగా పంటలు వేశారు. కానీ వాటికి తెగుళ్లు సోకి ఎండిపోతున్నాయి.

ఇదీ చదవండి : TEN ANDHRA NAVAL UNIT NCC: అక్కడి కఠోర శిక్షణ...బంగారు భవితకు నిచ్చెన

Bengalgram Crop in Prakasham :శెనగ మొక్క ఎదుగుతున్న దశలో ఎండు తెగులు సోకి పూర్తిగా పంట ఎండిపోతోంది. సస్యరక్షణ చేపట్టినా తెగుళ్లు తగ్గలేదు. చేసేది లేక.. పర్చూరు, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, ఉప్పుగుండూరులో చాలామంది రైతులు శెనగ పంటను తొలగించారు. దాని స్థానంలో మినుము, జొన్న, పెసర పంటలు వేసుకుంటున్నారు.

" గత పదేళ్ల నుంచి శెనగ సాగు చేస్తున్నాం. గత ఏడాది అధిక వర్షాలకు దెబ్బ తిన్న మిర్చి పంటను పీకివేసి మరీ శెనగ పంటను వేశాం. అయినా కానీ భూమిలో ఫంగస్ ఉండటం కారణంగా కళ్లాలు కళ్లాలుగా ఎకరంలో 60శాతం మేర శెనగ పంట ఎండిపోతుంది. " -వెంకట్రావు, రైతు, నాగులుప్పలపాడు

" ఈ ఏడాది నేను 6ఎకరాలు శెనగ సాగు చేశాను.అందులో వర్షాల కారణంగా 2 ఎకరాల పంటకు తెగులు వచ్చి మొత్తం పూర్తిగా పాడయ్యింది. దిగుబడి రాకపోవడంతో శెనగ పంటను తీసివేసి జొన్న వేశాము. " -ఆంజనేయులు, రైతు, ఉప్పుగుండూరు.

" వర్షాల ఎక్కువ పడటం వల్ల శెనగ పంట వేయడం ఒక నెల వెనుకబడింది. తెగుళ్ల బారిన పడటంతో ఈ ఏడాది దిగుబడి తగ్గింది. ప్రతీ ఏటా ఎకరానికి 8 నుంచి 10క్వింటాళ్లు దిగుబడి వచ్చేది. కానీ ఈ సంవత్సరం 4 నుంచి 5 క్వింటాళ్లు రావడమే గగనంగా మారింది. " - సింగారావు, రైతు

తెగుళ్ల నుంచి పంటలు కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేసినా దక్కడం లేదని శెనగ రైతులు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాలను ప్రభుత్వానికి నివేదించి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :

Guinness World Record Painting : గిన్నిస్ రికార్డు మీద కన్నేశాడు...భారీ చిత్రాన్ని గీశాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.