విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ బీసీఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. మూడు లక్షల యాభై వేల కోట్ల ఖరీదైన విశాఖ ఉక్కును పోస్కో కంపనీకి కేవలం ఐదు వేల కోట్లకు ధారాదత్తం చేయటం దారుణమని మండిపడ్డారు. విశాఖ ఉక్కును పోస్కోకు కట్టబెట్టాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై నిరసన