ETV Bharat / state

రాష్ట్రంపై తెలంగాణ పెత్తనం అవసరమా?

యువతకు ఉద్యోగాలు రావాలంటే తెదేపా తిరిగి అధికారంలోకి రావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రా వాళ్లను వద్దన్న కేసీఆర్ వ్యాఖ్యలు గుర్తు చేసిన బాబు.. రాష్ట్రంపై తెలంగాణ పెత్తనం అవసరమా అని ప్రశ్నించారు.

ప్రకాశం జిల్లా మూలగుంటపాడు సభలో చంద్రబాబు
author img

By

Published : Mar 25, 2019, 9:43 PM IST

Updated : Mar 26, 2019, 6:59 AM IST

ప్రకాశం జిల్లా మూలగుంటపాడు సభలో చంద్రబాబు
యువతకు ఉద్యోగాలు రావాలంటే తెదేపా తిరిగి అధికారంలోకి రావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మూలగుంటపాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం ఐదేళ్లపాటు పనులు చేసి.. మళ్లీ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానన్నారు. బాబు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయన్న చంద్రబాబు... జగన్‌ను నమ్ముకుంటే జైలుకు వెళ్లడమేనని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించేది పేదవాళ్ల కోసమేనని స్పష్టం చేసిన సీఎం.. ఆడబిడ్డలకు పసుపు-కుంకుమ ఇస్తూనే ఉంటానని తెలిపారు. నాలుగు, ఐదో విడత రుణమాఫీ ఏప్రిల్‌ 1న రైతుల ఖాతాల్లో పడుతుందన్న సీఎం...15 లక్షల మంది డ్రైవర్లకు తనే నెంబర్‌వన్‌ డ్రైవర్‌నని పేర్కొన్నారు. కోటిమంది డ్వాక్రా మహిళలకు త్వరలో స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు.

దేశంలోని అన్ని రకాల కేసులూ జగన్‌పై ఉన్నాయన్న సీఎం..రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా అన్ని సమస్యలు పరిష్కరించామన్న సీఎం.. ప్రపంచంలోనే ఏపీని నెంబర్‌వన్‌ చేసేవరకు నిద్రపోనని తెలిపారు. జగన్‌తో లాలూచీపడి ఏపీని నాశనం చేసేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారన్నారు. ఆత్మగౌరవం దెబ్బతిస్తే సహించేది లేదని కేసీఆర్‌ను సీఎం హెచ్చరించారు. జగన్‌కు ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రం నాశనమేనని చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని హెచ్చరించారు. ఆంధ్రా వాళ్లను వద్దన్న కేసీఆర్ వ్యాఖ్యలు గుర్తు చేసిన బాబు.. రాష్ట్రంపై తెలంగాణ పెత్తనం అవసరమా అని ప్రశ్నించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేసి మరోసారి తెదేపానే గెలిపించాలని ఓటర్లను కోరారు.

Mumbai, Mar 24 (ANI): While addressing a press conference, Delhi Capitals' batsman Colin Ingram said, "Special knock, last year watched Rishabh Pant from the couch he seemed in similar form, it's a great sign for us that he is in good form, he is a match winner of the day. Loosing early wicket in the partnership is probably vital that time, it's been a great time to build certain relationship quickly enjoyed that partnership with Shikhar Dhawan that set the base for our innings to explode fortunately guys down the order they came to the party and made it happened." Mumbai Indians were bowled out for 176 runs in 19.2 overs. Delhi Capitals (DC) opened their IPL 2019 campaign with a 37-run win against three-time champions Mumbai Indians (MI) at Wankhede Stadium in Mumbai.
Last Updated : Mar 26, 2019, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.