ఒంగోలు నుంచి ఐస్లోడ్తో ప్రయాణిస్తున్న వాహనంలో... అద్దంకి సమీపానికి చేరగానే విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆటోలో ఉన్న వారు గమనించి కిందకి దిగి పరుగులు తీశారు.
విషయం తెలుసుకున్న అద్దంకి అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేశారు. సుమారు 2 లక్షల రూపాయల విలువైన ఆటో తగలబడిపోయిందని యజమాని గద్దె ప్రేమానందం ఆవేదన చెందారు.
ఇదీ చదవండి: