ETV Bharat / state

తాళం వేసిన ఇంట్లో చోరీ... నిందితుడి అరెస్ట్

ప్రకాశం జిల్లా చీరాలలో తాళం వేసిన ఇంట్లో దొంగలుపడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు... పదిన్నర సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ... నిందితుడి అరెస్ట్
author img

By

Published : Sep 29, 2019, 5:14 PM IST

తాళం వేసిన ఇంట్లో చోరీ... నిందితుడి అరెస్ట్

తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని... ప్రకాశం జిల్లా చీరాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పదిన్నర సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీలపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. పక్కా ప్రణాళిక ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అల్లు సంజయ్ గా గుర్తించి కటకటాల్లోకి నెట్టారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ... నిందితుడి అరెస్ట్

తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని... ప్రకాశం జిల్లా చీరాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పదిన్నర సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీలపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. పక్కా ప్రణాళిక ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అల్లు సంజయ్ గా గుర్తించి కటకటాల్లోకి నెట్టారు.

ఇదీ చదవండి:

ప్రొద్దుటూరులో పోలీసుల తనిఖీలు... 2 కిలోల బంగారం సీజ్​

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్..... ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందితేనే జీవితంలో గొప్ప విజయం సాధించినట్లు భావించే ప్రస్తుత రోజుల్లో ఏకంగా మూడు ఉద్యోగాలకు ఎంపికై సత్తా చాటాడు గుంటూరు వాసి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షలలో గుంటూరుకు చెందిన అక్బర్ అత్యధిక మార్కులు సాధించి మూడు ఉద్యోగాలకు ఎంపిక య్యాడు.

ఉమ్మడి కుటుంబం సహకారం ముందు నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో వార్డ్ సచివాలయం రూపంలో అతని తలుపు తట్టి ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు ఉద్యోగాలకు ఎంపిక అయ్యాడు అక్బర్. గుంటూరు నగరానికి చెందిన అక్బర్ ఇటీవల జరిగిన గ్రామ వార్డు సచివాలయ మూడు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మూడు ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశాడు. నగరంలోని కంకరగుంట ప్రాంతానికి చెందిన అక్బర్ ఉమ్మడి కుటుంబం. తండ్రి సలీం మరణానంతరం కుటుంబం పెద్దగా అన్నయ్య షాజహాన్ బాధ్యతలు తీసుకుని తమని ఉన్నత చదువులు చదివించారని అక్బర్ తెలిపారు. గ్రూప్స్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా అక్బర్ రెండు పర్యాయాలు క్వాలిఫై అయిన మెయిన్స్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దికాలం పాటు ఓ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తూ డిఎస్సీ పరీక్ష రాశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం పరీక్ష నిర్వహించగా వార్డ్ సచివాలయంలో 81మార్కులతో 452వ ర్యాంక్, శానిటేషన్ పరీక్షలలో 56.4 మార్కులతో 91 వ ర్యాంకు, మత్స్య సహాయకుల పరీక్షలో 62.5 మార్కులతో 96 ర్యాంకు సాధించారు.

తన కుమారుడు ప్రభుత్వ ఉద్యగి అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తల్లి సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన సోదరుడు మూడు ఉద్యోగాలకు ఎంపిక కావడం తమకు గర్వకారణంగా ఉందని. తమ వంశంలోని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పుకోవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని అక్బర్ సోదరులు తెలియజేశారు. తాను ఇటువంటి విజయం సాధించడం గొప్ప విషయమని ఆయన వివరించారు


Body:బైట్....షైక్ అక్బర్, అభ్యర్థి

బైట్....గుల్జార్ బేగం, అక్బర్ తల్లి

బైట్....డాక్టర్.షాజహాన్, అక్బర్ సోదరుడు

బైట్....డాక్టర్.ఖాజా ఫిర్, అక్బర్ సోదరుడు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.