ETV Bharat / state

అప్పు పుట్టక.. ఆక్వా రైతుకు అనంత కష్టం - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

రైతుకు 'అప్పు-సాగు' కు.. విడదీయలేని సంబంధం ఉంటుంది. పెట్టుబడుల కోసం అప్పు చేయడం, లేదంటే విత్తనాలు, ఎరువులు వంటివి అరువు పద్దతిలో సమకూర్చుకోవడం రైతు అలవాటు... పంట చేతికి వచ్చాక వ్యాపారికి బకాయిలు తీర్చుకొని, మిగిలినదాంతో జీవనం సాగించడం ఆనవాయితీ. వ్యాపారికి, రైతుకు మధ్య సంబంధం తరతరాలుగా వస్తోంది. అయితే... ఈ ఏడాది అప్పు, అరువు పుట్టక రైతాంగం కుదేలయ్యింది. ప్రకాశం జిల్లాలో ఈ విషయంలో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఫలితంగా సాగు తగ్గించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది... ఈ కారణంగా జిల్లాలో 30 నుంచి 40 శాతం చెరువులు ఖాళీగా వదిలేశారు.

పెట్టుబడి లేక కష్టాలు ఎదుర్కొంటున్న ఆక్వా రైతు

author img

By

Published : Mar 15, 2021, 12:57 PM IST

పెట్టుబడి లేక కష్టాలు ఎదుర్కొంటున్న ఆక్వా రైతు

ప్రకాశం జిల్లాలో శింగరాయకొండ మండలం నుంచి చీరాల వరకూ తీరం వెంబడి అధికారికంగా 23వేల ఎకరాలు, అనధికారికంగా మరో 10వేల ఎకరాల్లో వనామీ సాగుచేస్తున్నారు. గత ఏడదంతా కరోనా కారణంగా లాక్‌ డౌన్‌తో వ్యాపారాలు దెబ్బతిన్నాయి..రొయ్యల ఉత్పత్తి బాగున్నా కొనేనాధుడు కరువయ్యారు. 100 కౌంట్‌ ధర 80 నుంచి 100 రూపాయలకు కూడా కొనుగోలు చేయలేదు. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. కౌలు డబ్బు అప్పులు చేసి మరీ చెల్లించాల్సి వచ్చింది. విత్తనాలకు, ఆహారానికి సంబంధిత డీలర్లు, వ్యాపారుల వద్ద అరువు పద్దతి మీద కొనుగోలు చేసిన రైతు, బకాయిలు చెల్లించలేకపోయారు.

పాత బకాయిలు చెల్లిస్తేగానీ కొత్త అప్పు పుట్టదు... ఈ ఏడాది సాగుచేయాలని భావించినా రైతుకు రొయ్య పిల్లలు, అవసరమైన ఆహారం అరువు పద్దతిపై దొరక లేదు.వ్యాపారుల చుట్టూ కాళ్ళెరిగెలా తిరిగినా పాత అప్పులు తీర్చందే... తాము అరువు ఇవ్వలేమని, సంబంధిత కంపెనీలు కూడా అరువు పద్దతి పై సరఫరా చేయడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదని వ్యాపారులు ఖరాఖండీగా చెపుతున్నారు. రైతులు చేసేది లేక చాలా మంది ఆక్వా రైతులు చెరువులను ఖాళీగా వదిలిపెట్టారు. మార్కెట్‌ బాగుంటే ప్రకృతి సహకరించదు.. ప్రకృతి , మార్కెట్‌ బాగుందనుకుంటే పెట్టుబడులు ఉండటం లేదని ఆక్వారైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ స్టీల్​ ప్లాంట్​ అమ్మకం కాదు.. అప్పగింతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.