ETV Bharat / state

కరవుతో ఆక్వా రైతు విల విల - జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ - Aqua Farmers Problems in Ongole

Aqua Farmers Problems: వర్షాభావ పరిస్థితులు ఆక్వా రైతును ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నీటిలో లవణ శాతం పెరగిపోతుండటం వల్ల రొయ్య ఎదుగుదల తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు మార్కెట్‌ కూడా సరిగా లేకపోవడం కూడా నష్టాలకు గురిచేస్తోంది. ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతంలో వేలాది ఎకరాల్లో టైగర్‌ రొయ్య సాగు చేస్తున్నారు. వనామి వల్ల దిగుబడి లేక టైగర్‌ సాగు చేస్తున్నామని, అయినా కొనుగోలు దారులు సరైన ధర లభించడం లేదని, రైతు అవసరాన్ని వ్యాపారులు వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Aqua_Farmers_Problems
Aqua_Farmers_Problems
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 10:25 AM IST

Updated : Nov 18, 2023, 10:42 AM IST

కరవుతో ఆక్వా రైతు విల విల - జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌

Aqua Farmers Problems : ప్రకాశం జిల్లా టంగుటూరు, ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల్లో తీర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో టైగర్‌ రొయ్య సాగు (Tiger Prawn Cultivation) చేస్తున్నారు. వర్షాలు సక్రమంగా కురిస్తే నీటిలో లవణ శాతం ఉండి రొయ్య ఎదుగుదలకు ఉపకరిస్తుంది. వర్షపు నీరు, ఉప్పు నీరు కలిసి మంచి దిగుబడి వచ్చి ఉండేది. కానీ కరవు పరిస్థితులు (Drought Conditions) కారణంగా ఇప్పుడు భిన్నమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తుంది. వర్షాలు లేక భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. బోర్ల ద్వారా నీటిని తోడుతుంటే లోతుకు వెళ్ళే సరికి ఉప్పునీరు వస్తుంది. దీని వల్ల రొయ్య ఎదుగుదల ఉండలం లేదు. 150 రోజులుకు రావలసిన పంట 200 రోజులకు వస్తుంది. దీని వల్ల మేత, విద్యుత్తు చార్జీలు అదనపు ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నీటిలో లవణ శాతం పెరగడం వల్ల తెగుళ్ళు వస్తున్నాయని ఆక్వా రైతులు వాపోతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ప్రశ్నార్థకంగా ఆక్వా రంగం.. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు

Fish Farming Situation in Ongole : వర్షాభావ పరిస్థితులు వల్ల బోర్లు,. ఏరియేటర్లు వినియోగం పెరుగుతుంది. ఫలితంగా విద్యుత్తు వినియోగం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా టారిఫ్‌ పెరిగి విద్యుత్తు చార్జీలు కూడా తడిక మోపడు అవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. గతంలో ఆక్వా రైతుకు యూనిట్​కు రూపాయిన్నర ఉన్న విద్యుత్తు చార్జీలు (Electricity Charges) ఇప్పుడు అన్ని రకాల ఛార్జీలు కలిపి దాదాపు 6 నుంచి 7 రూపాయలు వరకూ పడుతుందని వీరు పేర్కొంటున్నారు. నెలకు 20 వేలు బిల్లు వచ్చే చోట ఇప్పుడు లక్షా పాతిక వేలు వరకూ చెల్లిస్తున్నామని దీని వల్ల సాగు చేయాలంటే భయం వేస్తుందని రైతులు వాపోతున్నారు.

Prawns Farmers problems దిక్కు తోచని స్థితిలో రోయ్య సాగు రైతులు..! ప్రశ్నార్థకంగా మారిన ఆక్వా సాగు..!

Aqua Farmers Problems in Andhra Pradesh : పంట సమయం ఎక్కువ కావడం వల్ల సాగు ఖర్చులు భరించలేక కౌంట్‌ రాకుండానే పట్టుబడి చేస్తే, తమ అవసరాలను, ఇబ్బందులను గుర్తించి వ్యాపారులు తక్కువ రేటుకు కొంటున్నారని, 100 కౌంట్‌ ఉన్న రొయ్య గత వారంలో 240 రూపాయలు వరకూ ఉంటే, ఇప్పుడు 200 రూపాయలు కూడా లభించడంలేదని, వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గి, ధర లేక ఇబ్బంది పడుతున్నామని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

CM Jagan on Aquaculture Industry : ప్రతిపక్ష నేతగా జగన్‌ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆక్వా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. విద్యుత్తు చార్జీలపై రాయితీ ఇస్తే గానీ.. ఆక్వా రైతుకు మేలు జరగదని రైతులు అభిప్రాయపడుతున్నారు.

ఆక్వా జోన్ల పేరుతో దోపిడీ.. లబోదిబోమంటున్న రొయ్యలు, చేపల రైతులు

Last Updated : Nov 18, 2023, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.