ETV Bharat / state

తగ్గిన పొగాకు దిగుబడి... తీవ్రంగా నష్టపోయిన రైతులు

ప్రకాశం జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటల్లో పొగాకు ఒకటిగా గుర్తింపు పొందింది. గతేడాది నవంబర్‌లో కురిసిన వర్షాల కారణంగా అప్పటికే సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల మొక్క ఎదుగుదల దశలో ఉండగానే తెగుళ్లు సోకి పంట దెబ్బతింది. పెట్టుబడి ఖర్చులు ఎక్కువ అయ్యాయని, దిగుబడి మాత్రం ఆశించినంతగా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

tobaco on farmers
tobaco on farmers
author img

By

Published : Feb 4, 2022, 11:50 AM IST

ప్రకాశం జిల్లాలో రైతులు ఎక్కువగా పొగాకు పంటను పండిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 వేల పొగాకు బ్యారన్‌లు ఉన్నాయి. ఒక్కో బ్యారన్‌కి ఏడు ఎకరాల పంట సాగు చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. దీనికి మించి అదనంగా పండిస్తే 10 శాతం రుసుం కట్టాల్సి వచ్చేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ రుసుమును ఐదు శాతం తగ్గించింది. దీంతో రైతులు పొగాకు సాగు చేయడానికి మొగ్గు చూపారు. జిల్లావ్యాప్తంగా 42 వేల హెక్టార్లలో సాగు చేయడానికి 26 వేల మంది రైతులు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 వేల హెక్టార్లలో పొగాకు సాగు అయ్యింది.

గ్రేడ్​ను బట్టి ధర...

జిల్లాలో మొత్తం తొమ్మిది పొగాకు బోర్డుల పరిధిలో గత సంవత్సరం 63.98 మిలియన్‌ కిలోల పొగాకును అమ్మారు. ఎఫ్1 గ్రేడ్ పొగాకు రకానికి గరిష్ఠంగా 184 రూపాయలు, సరాసరి ధర 139, ఎఫ్10 రకానికి 10 రూపాయలు పలికింది. దీంతో కొంత మంది రైతులు అదనంగా పొగాకు సాగు చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే జిల్లాలోని టంగుటూరు, ఎన్జీపాడు తదితర ప్రాంతాల్లో పొగాకుకు పచ్చనగ పురుగు, లద్దె పురుగు, పొగ మల్లెతో పాటు పేనుబంక తెగులు సోకింది. వీటిని సమయానికి గుర్తించి మందులు పిచికారీ చేశారు.

ప్రభుత్వం ఆదుకోవాలి..

తెగుళ్లు వచ్చిన వాటిని తొలగించేందుకు రైతులు చాలా అవస్థలు పడ్డారు. సాగుకు అయ్యే ఖర్చులు పెరిగిపోయాయని వాపోతున్నారు. పురుగులు, తెగుళ్ల కారణంగా పొగాకు పంట దిగుబడి తగ్గిపోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: Software employees at Village: వారెవ్వా...వర్క్ ఫ్రం విలేజ్... బాగుందంటున్న టెక్కీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.