ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌ప హైకోర్టు విచారణ జరిపింది. ఒంగోలు- టంగుటూరు మధ్య మైనింగ్‌కు కేటాయించిన 1367 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించారని పిటిషనర్ వాదించారు. ఆ భూమి మైనింగ్‌కు అనుకూలం కాదని పిటిషనర్ తండ్రే చెప్పారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అతను తన తండ్రి కాదంటూ మరణ ధ్రువీకరణ పత్రాన్ని పిటిషనర్ జత చేశారు. ఈ క్రమంలో మరింత సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం... తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి