నవ భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్. అంబేడ్కర్ 130వ జయంతిని ప్రకాశం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. యర్రగొండపాలెంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ భారీ చిత్రపటంతో పట్టణంలో ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ చేపట్టారు. కనిగిరిలో తెలుగుదేశం నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేశారు. సీఐటీయూ యూనియన్ నాయకులు.. ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.
చీరాలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైకాపా, తెదేపా, వివిధ దళిత సంఘాల నాయకులు.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గిద్దలూరు తెదేపా కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కొందరి కుల అహంకారాన్ని ఎదిరించడంలో బాబాసాహెబ్ సాహసం మనకు ఆదర్శం కావాలన్నారు.
అద్దంకి పట్టణం బంగ్లా రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దారి చూపిన మహనీయుడని అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జీ బాచిన కృష్ణ చైతన్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: