కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో సంపూర్ణ లాక్డౌన్ను విధించారు. ఇలాంటి పరిస్థితి ఎక్కడ అమలు చేసినా.. అత్యవసర సేవలకు సంబంధించినవి తప్ప.. మిగతా అన్ని దుకాణాలు మూసివేస్తారు. కానీ కనిగిరిలో మాత్రం అలా కాదు. అత్యవసరమైన ఔషధ దుకాణాలు మూసివేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రం తెరిచే ఉన్నాయి.
అధికారులకు తమ ప్రాణాలంటే ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో కనిగిరిలో ఉన్న పరిస్తితిని చూస్తే అర్ధమవుతుందని ప్రజలు అంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు ఐదు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ను ప్రకటించారు. తాగడానికి పాలు దొరక్కపోయినా.. మద్యం మాత్రం యథేచ్ఛగా దొరుకుతోందని ఆవేదన చెందారు.
ఇదీ చూడండి:
వెంకన్నకు అన్నమయ్య కీర్తనలు రాస్తే.. చేతన్ యానిమేషన్ చేశాడు!