ప్రకాశం జిల్లా చీరాలలో ఒక మహిళ దారుణహత్యకు గురైంది. ప్రసాద్ సెంటర్ లోని ముత్యాలపేటలో నివసించే తోట కాత్యాయని(55) అనే వివాహితను గుర్తు తెలియని దుండగులు చంపేశారు. మృతురాలు పక్షవాతంతో మంచానికే పరిమితమైనందున ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితులు దాడి చేశారు.
మధ్యాహ్న సమయంలో భర్త తోట వెంకట రమణ మూర్తి పనిమీద బయటకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాడు. రక్తపుమడుగులో పడివున్న భార్యను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఒంటరిగా ఇంట్లో ఉన్న కాత్యాయనిని కత్తితో దాడిచేసి.. ఆమె ఒంటిపై ఉన్న సుమారు నాలుగులక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: