ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ శివారు అద్దంకి, నార్కెట్పల్లి రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని ఓ మహిళా, రెండు గేదెలు మృతి చెందాయి. ఏల్చూరుకు చెందిన ఇమామ్బి రహదారి దగ్గరలో గేదెలను మేపుతుండగా.. ప్రమాదవశాత్తు వీఆర్ఎల్ ప్రైవేట్ అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆమెతో పాటు రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి. కరెంటు తీగలు తగిలి మిర్చి దగ్ధం