తల్లి కోసం తండ్రిని బ్యాట్‌తో కొట్టిన కుమారుడు - ప్రకాశం జిల్లా తండ్రిని చంపిన కుమారుడు వార్తలు
తల్లిని కొడుతున్న తండ్రిపై కుమారుడు క్రికెట్ బ్యాట్‌తో దాడిచేశాడు. ఈ ఘటనలో ఇర్ఫాన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కారంచేడు మండలంలో జరిగింది.
తల్లి కోసం తండ్రిని బ్యాట్‌తో కొట్టిన కుమారుడు
ప్రకాశం జిల్లా కారంచేడులో దారుణం జరిగింది. దగ్గబాడుకు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్. నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాత్రి మద్యం మత్తులో భార్యపై దాడిచేస్తుండగా... కుమారుడు మస్తాన్ వలి అడ్డుకున్నాడు. అక్కడే ఉన్న కత్తితో కుమారుడిపై దాడికి దిగాడు ఇర్ఫాన్. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో... క్రికెట్ బ్యాట్‌తో తండ్రిని కొట్టగా ఇర్ఫాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు... అప్పటికే ఇర్ఫాన్ మృతిచెందాడు. కారంచేడు పోలీసులు కేసునమోదు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Intro:Body:Conclusion:
Last Updated : Dec 11, 2019, 2:27 PM IST