ETV Bharat / state

కరోనా కల్లోలం ఉన్నా తరగతులు నిర్వహించిన పాఠశాల

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా తలలు పట్టుకుంటుంటే దానికి భిన్నంగా ఓ ప్రైవేట్​ స్కూల్​ యాజమాన్యం మాత్రం తరగతులు నిర్వహిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ ఇంకా కొనసాగించే దిశగా ఉంటే ఆ స్కూల్​ మాత్రం పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో జరిగింది.

ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్​ స్కూల్

author img

By

Published : Mar 25, 2020, 5:39 AM IST

ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్​ స్కూల్

కరోనా వ్యాప్తి కారణంగా తరగతులు నిర్వహించడం మానివేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో ఓ ప్రైవేట్​ స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్​ఐ రవీంద్రారెడ్డి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని విద్యార్థులను ఇంటికి పంపించారు. పాఠశాలపై మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:

పోలీసులకు ప్రజలు సహకరించాలి: తణుకు సీఐ చైతన్య కృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.