ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వెల్లంపల్లికి చెందిన మార్తమ్మ (63), ఆమె కుమార్తె, అల్లుడు ద్విచక్రవాహనంపై ఓ శుభకార్యానికి బయలుదేరారు. వీళ్ల బైకును ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది.
ప్రమాదంలో మార్తమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన దంపతులను స్థానికులు ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: