ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం వడ్డే సంఘానికి చెందిన టి.ఏడుకొండలు కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం గడుపుతున్నారు. గురవారం రాత్రి పనిమీద వేటపాలెంకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఇసుక కుప్ప కనపడకపోవటం వల్ల అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన అతన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా... చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:
ప్రత్యేక హోదా అడగకుండా.. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు: చంద్రబాబు