ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో.. విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. కొత్తూరు పంచాయతీ శివారు అరుణగిరి తండాకు చెందిన మేడావత్ సురేష్ నాయక్ తన పొలంలో మోటారు బిగించేందుకు విద్యుత్తు వైర్లు సరి చేస్తున్నాడు. ఆ వైర్లకు విద్యుత్తు సరఫరా కావడంతో షాక్‌నకు గురై సురేష్ నాయక్ మృతి చెందాడు. మృతుని తండ్రి హర్యానానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: కొవిడ్ పంజా: 40 వేలు దాటిన మృతుల సంఖ్య