ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం.. - republic day celebrations

72వ గణతంత్ర దినోత్సవం ప్రకాశం జిల్లా ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్​ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ప్రకాశంలో ఘనంగా గణతంత్ర దినోత్స వేడుకలు
ప్రకాశంలో ఘనంగా గణతంత్ర దినోత్స వేడుకలు
author img

By

Published : Jan 26, 2021, 5:46 PM IST

ప్రకాశం జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ పోల భాస్కర్‌ త్రివర్ణ పతాకం ఆవిష్కరించి, పోలీస్‌ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా అభివృద్ధిని ప్రతిబింబించే శకటాల ప్రదర్శన అబ్బురపరిచింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధులు, దివంగత ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణను కలెక్టర్‌ ఘనంగా సన్మానించారు.

చీరాల మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో విశేష సేవలందించిన వారికి ప్రశంస పత్రాలను బహుకరించారు.

అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం
అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం

రాజ్యాంగానికి తూట్లుపొడిచే విధంగా వైకాపా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని చీరాల తెదేపా ఇన్​ఛార్జ్ యడం బాలాజీ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చీరాల రైల్వే స్టేషన్ కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఇవీ చదవండి: 'వాహన డ్రైవర్లే సరకులు పంపిణీ చేస్తారనడంపై ఆందోళనలో డీలర్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.